వర్మ పుట్టిన రోజున బిగ్ బి సినిమా | Amitabh Bachchan, Ram gopal Varma Sarkar 3 Releasing on April 7 | Sakshi
Sakshi News home page

వర్మ పుట్టిన రోజున బిగ్ బి సినిమా

Published Thu, Feb 9 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

వర్మ పుట్టిన రోజున బిగ్ బి సినిమా

వర్మ పుట్టిన రోజున బిగ్ బి సినిమా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన నెక్ట్స్ సినిమా రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేశాడు. సౌత్లో వరుసగా చిన్న సినిమాలతో తన స్థాయిని కోల్పోయిన వర్మ, తిరిగి బాలీవుడ్ చేరాడు. మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు అమితాబ్ బచ్చన్తో సక్సెస్ ఫుల్ సర్కార్ సీరీస్లో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్లో అమితాబ్, సర్కార్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ఎనౌన్స్ చేశాడు వర్మ. ఏప్రిల్ 7న తన పుట్టిన రోజు సందర్భంగా సర్కార్ 3 రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. అమితాబ్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపే సుభాష్ నాగ్రేగా కనిపిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్పాయ్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ తన సొంత నిర్మాణ సంస్థ ఏబీసీఎల్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement