హారతి పాట పాడిన మెగాస్టార్‌ | Ganpati Aarti by Amitabh Bachchan is powerful | Sakshi
Sakshi News home page

హారతి పాట పాడిన మెగాస్టార్‌

Published Wed, May 3 2017 8:23 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

హారతి పాట పాడిన మెగాస్టార్‌

హారతి పాట పాడిన మెగాస్టార్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి 'సర్కారు'గా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న 'సర్కార్‌-3'లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న 'సర్కార్‌' సిరీస్‌లోని రెండు సినిమాలకు ఇది సీక్వెల్‌. ఈ సినిమాలో ఎప్పటిలాగే అమితాబ్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రోనిత్‌ రాయ్‌, జాకీ ష్రఫ్‌, మనోజ్‌ బాజ్‌పేయి, యామీ గౌతమీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా కోసం స్వయంగా అమితాబ్‌ బచ్చనే గణపతి హారతి పాట పాడారు. అమితాబ్‌ గొంతులోని గాంభీర్యం, చక్కని కెమెరా పనితనంతో కూడిన ఈ పాట వీడియో ప్రోమో.. ట్రైలర్‌ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ పాట చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పాట లింక్‌ను అమితాబ్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement