కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ | Kolikapudi Srinivasa Rao And Tv5 Sambasiva Rao Attends Cid Investigation | Sakshi
Sakshi News home page

కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ

Published Tue, Jan 9 2024 8:57 AM | Last Updated on Tue, Jan 9 2024 9:47 AM

Kolikapudi Srinivasa Rao And Tv5 Sambasiva Rao Attends Cid Investigation - Sakshi

సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌­గో­పాల్‌ వర్మ తల­నరి­కి తెస్తే రూ.కోటి ఇస్తా­మన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలి­కపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్‌ యాంకర్‌ సాంబశి­వ­రావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యా­ల­యంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వా­రి­ద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు.

టీవీ 5 చానల్‌ నిర్వహించిన డిబేట్‌ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూ­ర్వ­కంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్‌ వర్మ పోలీసులకు ఫిర్యా­దు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయ­న పేర్కొ­న్న  కొలి­కపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్‌ ఎండీ, చీఫ్‌ ఎడిటర్‌ బి.ఆర్‌.­నాయుడు, న్యూ­స్‌ యాంకర్‌ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్‌ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీని­వాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచా­రించా­రు. కాగా ఆరోజు న్యూస్‌ యాంకర్‌ సాంబశివరావు వి­చా­ర­ణకు హాజరుకా­లేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లా­డా­రా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీ­య ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూ­డదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement