‘‘నేనిప్పటివరకూ ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ సినిమాలు చేశాను. కావాలని అలా ప్లాన్ చేయలేదు. ఇక నుంచి వేరే జానర్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకూ నా ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతోందని భావిస్తున్నాను’’ అని హీరో అరుళ్ నిధి అన్నారు. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’.
తమిళంలో హిట్ అయిన ఈ మూవీని ఎన్. శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి. సురేష్ రెడ్డి, బి. మానసా రెడ్డి తెలుగులో ఆగస్టు 23న రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అరుళ్ నిధి మాట్లాడుతూ– ‘‘డీమాంటీ కాలనీ 2’కి తెలుగులో వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాం.ప్రోడ్యూసర్ సురేష్ రెడ్డిగారు తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో మూడు, నాలుగో భాగాలు కూడా రానున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment