
సాక్షి, హైదరాబాద్: బుల్లితెరపై అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'సామ్ జామ్'. అయితే ఈ షోకు త్వరలోనే శుభం కార్డు పడనున్న సంగతి తెలిసిందే. చివరి ఎపిసోడ్ సందర్భంగా సామ్ జామ్‌కు హీరో నాగచైతన్య రానున్నాడు. సమంత హోస్ట్‌గా ఈ షో ప్రారంభం అవుతుదంటూ ట్రైలర్ విడుదలగానే దీనిపై ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ప్రారంభమైన అనంతరం ఈ షోకు అంతగా ప్రేక్షక ఆదరణ లభించలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ షో టీవీలో ప్రసారం కాకపోవడమేనని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. కేవలం ఓటీటీ ప్లాట్‌పాంలోనే ఈ షో ప్రసారమవ్వడంతో ప్రేక్షకులు అంతగ ఆసక్తి చూపకపోవడంతో వీక్షకుల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు సమాచారం. (చదవండి: నాకు నీ గురించి అన్నీ తెలుసు: చై)
దీంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా అనుకున్న పది ఎపిసోడ్స్ కంటే ముందుగానే ముగించాలని షో నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సామ్ జామ్ మొదటి సిజన్‌ను మొత్తం పది ఎపిసోడ్‌లుగా నిర్ణయించి.. పది మంది టాలీవుడ్ అగ్ర నటీనటులను గెస్ట్‌గా ఆహ్వానించాలని ఆహా వ్వవస్థాపకులు, నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారంట. ఇందుకోసం ఈ షో హోస్ట్ అయిన సమంతకు 1.5 కోట్ల రెమ్మూనరేషన్ కూడా ఇచ్చారంట. అయితే ఈ షోకు అంతగా వ్యూస్ రాకపోవడంతో 8 ఎపిసోడ్‌లకే సామ్ సామ్‌కు శుభం కార్డు వేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!)
తోలి ఎపిసోడ్‌ను మెగా స్టార్ చిరంజీవితో దీపావళి సందర్భంగా ప్రారంభించిన సామ్ జామ్‌లో ఇప్పటి వరకు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, తమన్నా, విజయ్ దేవరకొండ, దర్శకుడు క్రిష్, నాగ్ అశ్విన్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకు అతిథిగా డార్లింగ్ ప్రభాస్ కూడా రావాల్సి ఉంద. ఇక ఇటీవల సినిమా షూటింగ్‌లు కూడా ప్రారంభం కావడంతో అగ్ర హీరోలంతా బిజీ అయిపోయారు. దీంతో వారిని ఆహ్వానించడం సవాలుగా మారడంతో ఎనిమిది ఎపిసోడ్‌లకే ఈ షోను పరిమితం చేసినట్లు అల్లు అరవింద్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక రేపు జరిగే చివరి 8వ ఎపిసోడ్‌ను ఆసక్తిగా మార్చడానికి ఈ షో హోస్ట్ సామ్ భర్త, హీరో నాగచైతన్య అతిథిగా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింటా సందడి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment