నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లడానికి స్కెచ్ రెడీ చేశారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ ముగిసింది. ఫైట్ సీన్లు తీశారు. షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి తన భార్య పిల్లలతో (భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా) కలిసి స్విట్జర్లాండ్ వెళ్లొచ్చారు అల్లు అర్జున్. ఇప్పుడు షూటింగ్‌ను షురూ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఇక పెద్దగా బ్రేక్ తీసుకోకుండా సినిమా పూర్తయ్యే వరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారట. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment