పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టిన బన్నీ | Allu Arjun with his pregnant wife Sneha Reddy | Sakshi
Sakshi News home page

పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టిన బన్నీ

Published Mon, Mar 10 2014 8:16 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టిన బన్నీ - Sakshi

పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు తన భార్య స్నేహ రెడ్డితో కలిసివున్న ఫోటో కూడా పోస్ట్ చేశారు. దంపతులిద్దరూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ తమ కలల పంట కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఫోటోలో కనిపించారు.

'తన ప్రేమకు ప్రతిరూపం ఊపిరి పోసుకుని కళ్లకు ముందుకు వస్తే ఏ మగాడైన తన భార్య, బిడ్డతో మళ్లీ ప్రేమలో పడతాడు. క్యూటీ త్వరలో మా మధ్యకు వస్తుంది' అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే బన్నీ భార్య ఆడపిల్లకు జన్మినిచ్చినట్టు అంతకుముందు రుమార్లు వచ్చాయి. వీటిని అప్పుడే అల్లు అరవింద్ తోసిపుచ్చారు. ఇప్పుడు ఫోటోతో అల్లు అర్జున్ పుకార్లకు ఫుల్స్టాఫ్ పెట్టారు. స్నేహకు త్వరలోనే(ఈ నెలలోనే) డెలివరీ కానుందని సమాచారం. అంటే త్వరలోనే జూనియర్ బన్నీ రాబోతున్నాడన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement