తమన్నా స్పెషల్‌ సాంగు.. వరుణ్‌ మాసు స్టెప్పు | Thamanna Special Song In Ghani Movie | Sakshi
Sakshi News home page

తమన్నా స్పెషల్‌ సాంగు.. వరుణ్‌ మాసు స్టెప్పు

Published Mon, Jul 26 2021 12:03 AM | Last Updated on Mon, Jul 26 2021 12:05 AM

Thamanna Special Song In Ghani Movie - Sakshi

‘గని’తో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ స్టెప్పులేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గని’. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కాగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట తమన్నా. త్వరలో ఈ మాసీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్‌’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ వన్‌’, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రాల్లో తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.  అయితే ‘గని’ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కోవిడ్‌ కారణంగా రిలీజ్‌ వాయిదా పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement