
థియేటర్స్‌లో పంచ్ ఇవ్వడానికి గని రెడీ అయ్యాడు. హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గని పాత్రలో కనిపించనున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
‘‘ఈ సినిమాలో అన్ని పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య రిలీజ్ చేసిన ‘రోమియో జూలియట్...’ పాట కూడా బాగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment