Upendra Missed A Chance to direct Megastar Chiranjeevi for Movie - Sakshi
Sakshi News home page

ఉపేంద్ర డైరెక్షన్‌లో మెగాస్టార్‌ చిత్రం.. కానీ!

Published Thu, Apr 7 2022 12:05 AM | Last Updated on Thu, Apr 7 2022 9:20 AM

Upendra Missed A Chance to direct Megastar Chiranjeevi for Movie - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాను నటించిన 'A', ఉపేంద్ర వంటి చిత్రాల ద్వారా 24 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని కాని దానికంటే ముందు ఓ చిన్న ఫ్లాషబాక్‌ ఉంది.

'నాకు మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్‌ గురించి చెప్పాలి. 24 సంవత్సరాల క్రితం నేను డా. రాజశేఖర్‌తో 'ఓంకారం' అనే చిత్రాన్ని డైరెక్షన్‌ చేశాను. ఆ సమయంలో అశ్వినీదత్‌ నిర్మాణంలో మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే ఆఫర్‌ వచ్చింది. కానీ నాకు అదృష్టం లేక ఆ సినిమా చేయలేకపోయాను. అయితే ఇప్పటికీ ఆ చిత్రం చేయలేకపోయినందుకు బాధపడుతుంటాను' అని ఉపేంద్ర తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement