
మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు వరుణ్ తేజ్ కొణిదెల. బుధవారం (జనవరి 19న) వరుణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు తాజాగా నటిస్తున్న క్రీడా చిత్రం 'గని' నుంచి 'పవర్ ఆఫ్ గని' పేరిట స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ పాత్రను ఎలివేట్ చేస్తూ చూపించారు. సీరియస్ లుక్‌లో రింగులోకి దిగిన వరుణ్ ప్రర్థిని మట్టి కరిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు నీ కష్టానికి ప్రతిఫలం హిట్ రూపంలో తప్పకుండా దక్కుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment