అల్లు ఫ్యామిలీకి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. అల్లు రామలింగయ్య మొదలు.. అల్లు శిరీష్ వరకు కొన్ని దశాబ్ధాల నుంచి చిత్ర పరిశ్రమంలో ఈ ఫ్యామిలీ రాణిస్తుంది. అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శీరీష్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ మాత్రం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. నటన పట్ల ఆయనకు ఆసక్తి లేకపోవడంతో అతన్ని నిర్మాతగా చిత్ర సీమకి పరిచయం చేయబోతున్నాడు అల్లు అరవింద్. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'గని' సినిమాని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ గని సెట్స్ కు వెళ్లాడు. అక్కడ కాసేపు గడిపి గని టీమ్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అన్నయ్య అల్లు బాబీతో దిగిన ఓ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ చేశాడు అల్లు అర్జున్. ఇది గర్వించదగిన క్షణం అని పేర్కొంటూ ఫిలిం మేకర్‌గా అన్నయ్య జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకున్నారు. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి స్వాగతం అని పోస్ట్ పెట్టారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి అల్లు బాబీకి పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ చెబుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.
‘గని’ విషయాకొస్తే.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు.
A very prideful moment to see my brother #AlluBobby in a shooting as a producer. So glad his journey has started as a film maker officially . Welcome on board to ALLU ENT. #alluentertainment #allubros 🖤 pic.twitter.com/Iq3fsW8tK0
— Allu Arjun (@alluarjun) July 23, 2021
Comments
Please login to add a commentAdd a comment