వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. మెగా ఫోటో షేర్‌ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే | Chiranjeevi Shares Varun Tej And Lavanya Tripathi's Wedding Photo | Sakshi
Sakshi News home page

వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. మెగా ఫోటో షేర్‌ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే

Published Thu, Nov 2 2023 8:46 AM | Last Updated on Thu, Nov 2 2023 10:01 AM

Chiranjeevi Sher Varun Tej And Lavanya Tripathi Photo - Sakshi

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. న‌వంబ‌ర్ 1వ తేదీన ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు సందడి చేశాయి. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్‌టైల్‌, మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఆ వేడుకల్లో మెగా కుటుంబానికి చెందిన స్నేహితులు, సినీ సెలట్రిటీలే ఎక్కువగా ఉన్నారు.

(ఇదీ చదవండి: నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్‌)

కొత్త దంపతులు అయిన వరుణ్‌- లావణ్యలకు శుభాకాంక్షలు చెబుతూ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఒక ఫోటో షేర్‌ చేశారు. అందులో మెగా- అల్లు ఫ్యామిలీ హీరోలు ఉన్నారు. చిరంజీవితో పాటు పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌తో పాటు యంగ్‌ హీరోలు ఉన్నారు. అభిమానుల కోసం మెగాస్టార్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోకు భారీగా లైకులు పడుతున్నాయి.

చిరు పోస్ట్‌ చేసిన ఫోటోను కొన్ని క్షణాల్లోనే పవన్‌, రామ్‌ చరణ్‌లతో పాటు మెగా హీరోలు అందరూ షేర్‌ చేస్తున్నారు.  కొత్త దంపతులకు మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పెళ్లిలో రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, నితిన్ త‌దిత‌ర సెల‌బ్రిటీ క‌పుల్స్‌ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. నేడు హైదరాబాద్‌కు ఈ కొత్త జంట రానుంది.  సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌- కన్వెన్షన్‌లో వరుణ్‌- లావణ్యల రిసెప్షన్‌ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement