వరుణ్- లావణ్య పెళ్లిలో బన్నీ కూతురు సందడి..! | Varun Tej-Lavanya Tripathi wedding: Allu Arjun daughter Arha enjoys breakfast | Sakshi
Sakshi News home page

Varun Tej-Lavanya: వరుణ్- లావణ్య పెళ్లిలో అల్లు అర్హ.. ఎంత స్టైలిష్‌గా ఉందో!

Published Tue, Oct 31 2023 9:33 PM | Last Updated on Wed, Nov 1 2023 8:31 AM

Varun Tej-Lavanya Tripathi wedding Allu Arjun daughter Arha enjoys breakfast - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలు హాజరవుతున్నారు. ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాక్‌టెయిల్‌ పార్టీ, హల్దీ వేడుకలు ముగిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట హల్‌ చల్ ‍చేస్తున్నాయి. 

(ఇది చదవండి: ఈ ముహూర్తంలోనే వరుణ్‌- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?)

సోమవారం రాత్రి జరిగిన కాక్‌ టెయిల్‌ పార్టీలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ పార్టీలో రామ్‌ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ మరింత స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కనిపించింది. 

తాజాగా అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా  స్టోరీస్‌లో పంచుకుంది. ఆ ఫోటోల్లో అర్హ బ్రేక్‌ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. బన్నీ సైతం తన కుమారుడు అయాన్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. కాగా.. వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి నవంబర్‌ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

(ఇది చదవండి: నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement