allu ayan
-
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
వరుణ్- లావణ్య పెళ్లిలో బన్నీ కూతురు సందడి..!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలు హాజరవుతున్నారు. ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాక్టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. (ఇది చదవండి: ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?) సోమవారం రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. తాజాగా అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఆ ఫోటోల్లో అర్హ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. బన్నీ సైతం తన కుమారుడు అయాన్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. కాగా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
పవన్ సినిమాలో బన్నీ తనయుడు..?
సెట్స్ మీదకు రాక ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ సమయంలో కూడా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో ఫోటోలతో సోషల్ మీడియా మోత మోగిపోతుంటే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త మెగా అభిమానులకు పండగ వాతావరణం తీసుకు వచ్చింది. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో మరో మెగా వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న బాబును కాపాడే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్లో అల్లు అర్జున్ తనయుడు అయాన్ నటిస్తున్నాడన్నదే ఇప్పుడు మెగా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇప్పటికే బన్నీ ఫేస్ బుక్ పేజ్ మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న అయాన్ త్వరలోనే వెండితెర మీద కనిపించనున్నాడన్న న్యూస్ మెగా అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా పవర్ స్టార్, అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం పండగ పూట ఇది తీపి కబురే అని చెప్పాలి.