
Varun Tej Ghani Teaser Out Now: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీని నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ!
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ను వదిలారు మేకర్స్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తుండగా.. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. మధ్యలో ‘ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్’ అంటూ చెప్పిన డైలాగ్ కేక పెట్టించేలా ఉంది. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
చదవండి: కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్ ట్రీట్