వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా గని కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 8న మూవీని విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ తమ అధికారికరంగా వెల్లడించింది.
చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే
వరుణ్ తేజ్ బాక్సార్‌గా కనిపించనున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ భామ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
Mega Prince @IAmVarunTej's #Ghani is all set to hit the screens on 𝐀𝐏𝐑𝐈𝐋 𝟖𝐭𝐡! 🥊#GhaniFromApril8th 🤩@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/IFnZNDWBSt
— Geetha Arts (@GeethaArts) March 2, 2022
Comments
Please login to add a commentAdd a comment