తమన్నా 'కొడ్తే' ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది | Tamanna Bhatia Kodthe Full Video Song Released From Ghani Movie | Sakshi
Sakshi News home page

Tamannaah: కొడ్తే ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది, తమన్నా స్టెప్పులతో అదరగొట్టిందిగా!

Published Thu, Mar 24 2022 4:47 PM | Last Updated on Thu, Mar 24 2022 4:47 PM

Tamanna Bhatia Kodthe Full Video Song Released From Ghani Movie - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే! 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జాగ్వార్‌', 'జై లవకుశ', 'కేజీఎఫ్‌: చాప్టర్‌ వన్‌', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గనిలో ఆమె డ్యాన్స్‌ చేసిన కొడ్తే ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటలో బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగిన తమన్నా స్టెప్పులతో రఫ్ఫాడిచ్చింది. తమన్‌ మ్యాజిక్‌, తమన్నా ఫిజిక్‌ మామూలుగా లేవంటూ యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఆలపించింది. అల్లు బాబీ -  సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. 

చదవండి: అభిమానంతో థియేటర్ మొత్తం బుక్‌ చేసిన పాకిస్తాన్‌ మోడల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement