
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం ఈ రోజు విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు(ఏప్రిల్ 2న) సాయంత్రం జరగనున్న ఈ వెంట్ కోసం బన్నీ విశాఖకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా విశాఖలోని అభిమానులు అల్లు అర్జున్‌కు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Allu Arjun gets massive welcome at Vizag Airport. He came to attend Ghani Pre release event. #Ghani #AlluArjunForGhani #AlluArjun pic.twitter.com/MsI5HnNdTO
— Phani Kumar (@phanijournalist) April 2, 2022