‘‘గని’ బాక్సింగ్ నేపథ్యంలో ఉన్నా ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. చక్కటి కథని నిజాయతీగా తీశాం. మా సినిమా గురించి గొప్పలు చెప్పను. కానీ, ‘గని’ మంచి చిత్రం. ప్రేక్షకులు కూడా మంచి సినిమా చూశాం అంటారు’’ అని అల్లు బాబీ అన్నారు. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు బాబీ, సిద్ధు ముద్ద చెప్పిన విశేషాలు...
అల్లు బాబీ మాట్లాడుతూ.. ‘‘పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీకి క్యూబ్ సిస్టమ్‌ని తీసుకొచ్చింది నేనే. ‘జస్ట్ టిక్కెట్’ సంస్థతో పాటు ‘ఆహా’లోనూ యాక్టివ్‌గా ఉన్నాను. అయితే నేను తెరవెనకే ఉండటంతో ఎక్కువగా ఫోకస్ కాలేదు. ఇప్పుడు సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాను. బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ కథ రెడీ చేసి, వరుణ్ తేజ్‌కి వినిపించాడు కిరణ్. వరుణ్‌కి బాగా నచ్చింది. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్), నేను, సిద్ధు విన్నాం.. మాకూ నచ్చింది. కిరణ్‌పై ఉన్న నమ్మకంతో తనే డైరెక్షన్ చేస్తాడని వరుణ్ అంటే ఓకే అన్నాం.
అందుకే వరుణ్‌ని తీసుకున్నాం..
ఈ సినిమా కోసం వరుణ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా మేకోవర్ అయ్యారు. ‘గని’ కథకి తను కరెక్ట్ అని తీసుకున్నామే కానీ మా కజిన్ బ్రదర్ అని కాదు. సిద్ధు ముద్ద కూడా మా కజిన్ బ్రదరే. సయీ మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర.. వంటి వారిని కథకు అవసరం మేరకు తీసుకున్నామే కానీ ‘గని’ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని కాదు. అయితే కన్నడంలో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాం.
ఆ బాధ్యత నాదే..
నాన్నగారు (అల్లు అరవింద్) ‘నీకు నువ్వుగా కష్టపడి పని నేర్చుకో.. నీకు నచ్చింది చెయ్’ అన్నారు. ఆయన ఇచ్చిన సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌కి మంచి పేరుంది. అయినప్పటికీ ‘అల్లు బాబీ కంపెనీ’ అనే ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశాను. ‘గని’ సినిమా రిజల్ట్ ఏదయినా పూర్తి బాధ్యత నాదే. నా ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత నటీనటులు. అది అల్లు అర్జున్ కావొచ్చు, వరుణ్ కావొచ్చు.. లేకుంటే వేరేవారు కావొచ్చు. నటీనటుల రెమ్యునరేషన్‌నూ పరిగణనలోకి తీసుకుంటా. నేనే సినిమా తీసినా మంచి కథతోనే తీస్తాను. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాను.
రెండక్షరాల టైటిల్ కావాలనుకున్నాం – సిద్ధు ముద్ద
మరో నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ– ‘‘గద్దలకొండ గణేష్’ చిత్రం నుంచే అమెరికాలో ప్రొఫెషనల్ బాక్సింగ్ నేర్చుకున్నారు వరుణ్ తేజ్. ‘గని’ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు రియల్ బాక్సింగ్‌లా ఫీలవుతారు. ఈ చిత్రానికి ముందు ‘గణేశ్, బాక్సర్, ఫైటర్’ వంటి టైటిల్స్ అనుకున్నాం. రెండక్షరాలతో కావాలని ‘గని’ ఫిక్స్ చేశాం. తెలుగులో వస్తున్న తొలి ప్రొఫెషనల్ బాక్సింగ్ చిత్రం మాదే. కిరణ్ చక్కగా తీశాడు. తమన్ మంచి నేపథ్య సంగీతం అందించారు. జార్జ్ సి. విలియమ్స్ మంచి విజువల్స్ అందించారు. మా సినిమా తప్పకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అన్నారు.
చదవండి: బార్‌లో తాగి రెచ్చిపోయిన హీరో.. సింగర్‌పై లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment