
వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ బాగానే కష్టపడుతున్నాడు. జిమ్‌కెళ్లి కండలు పెంచడమే కాకుండా.. బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అందులో వరుణ్ తేజ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభినట్టుగా తెలిపారు.
And the final round begins!!!🥊🥊🥊#Ghani pic.twitter.com/US3IsMQWa7
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) July 10, 2021
Comments
Please login to add a commentAdd a comment