
Ghani Movie Trailer: వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.
చదవండి: సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో హైలెట్ అయ్యింది. ఇందులో వరుణ్ ‘ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి’ అని ‘ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’ అంటూ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా సందడి చేయనుండగా.. నటి నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment