Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Release Date and Platform Details in Telugu - Sakshi
Sakshi News home page

ఆహాలో అశోకవనంలో అర్జున కల్యాణం, ఎప్పుడంటే?

Published Wed, May 18 2022 5:02 PM | Last Updated on Wed, May 18 2022 5:23 PM

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie OTT Release Date Confirmed - Sakshi

Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Release Date: వరుస అపజయాల తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో హిట్‌ అందుకున్నాడు హీరో విశ్వక్‌సేన్‌. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్‌ పాత్రలే చేసిన ఈ మాస్‌ హీరో ఈసారి మాత్రం భిన్నంగా వినోదాత్మక పాత్రలో నటించి మెప్పించాడు. అతడు హీరోగా రుక్సార్‌ ధిల్లాన్‌, రితికా నాయక్‌ హీరోయిన్లుగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మే 6న రిలీజైంది.

విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

చదవండి 👇

ఆది పినిశెట్టి పెళ్లి వేడుకల్లో టాలీవుడ్‌ హీరోల డ్యాన్స్‌

ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్‌ప్రైజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement