
Ashoka Vanamlo Arjuna Kalyanam Locks OTT Platform: ‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథలతో మెప్పిస్పున యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఇప్పటి వరకు మాస్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా క్లాస్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. విద్యాసాగర్ చింత ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు(మే 6న) థియేటర్లో విడుదలైంది. పెద్ద వివాదం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది.
చదవండి: అబద్దాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది : సమంత
గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెళ్లి అనే కన్సెప్ట్ చూట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. కొంతమంది ఫన్నీగా ఉంది అంటుండగా మరికొందరు సినిమాను చాలా లాగ్ చేశారంటున్నారు. ఇలా మిశ్రమ స్పందన తెచ్చుకుంటూ యవరేజ్‌గా నిలిచిన ఈమూవీ త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం.
చదవండి: ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందట. అయితే ఈ సినిమా నెల రోజుల తర్వాత ఆహా విడుదల కానుందని టాక్. అంటే జూన్ మొదటి వారంలో ఈమూవీ ఓటీటీలో విడదుల కానుందన్న మాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment