Rukshar Dhillon Says About Her Relationship In Past Deets Inside - Sakshi
Sakshi News home page

Rukshar Dhillon: తన రిలేషన్‌షిప్‌ గురించి చెప్పిన విశ్వక్‌ సేన్‌ బ్యూటీ

Published Fri, Jan 21 2022 3:29 PM | Last Updated on Fri, Jan 21 2022 3:56 PM

Rukshar Dhillon Said About Her Relationship In Past - Sakshi

Rukshar Dhillon Said About Her Relationship In Past: 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ రుక్సార్‌ దిల్లాన్‌. వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీద ఉంది ఈ ఏబీసీడీ బ్యూటీ. ప్రస్తుతం యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రం ముప్పై ఏళ్లు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారీ పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది రుక్సార్‌. తాను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని పేర్కొంది. అలాగే తనకు కాబోయేవాడు నిజాయితీగా, నిబద్ధతో ఉంటడాలని కోరుకుంటోందట ఈ అమ్మడు. 



(చదవండి: విశ్వక్‌ సేన్‌కు పిల్ల దొరికేసింది.. జనవరి 19న)

ఆమె పెళ్లి చేసుకుని జీవితాంతం గడిపే వ్యక్తి గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటోంది రుక్సార్‌. పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటానని చెప్తున్న రుక్సార్‌కు ప్రేమ వివాహంపై నమ్మకం ఉందని తెలిపింది. 2017లో ఆకతాయి సినిమాతో టాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసింది. లండన్‌లో పుట్టిన ఈ సుందరి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. బెంగళూర్‌లో నివాసం ఉంటోన్న ఈ భామ 2020లో 'భాంగ్రా పా లే' అనే హిందీ సినిమాతో బీటౌన్‌కు కూడా పరిచయమైంది. 



(చదవండి:ఒక్క సంబంధం చూడండి, లేదంటే ఎలా పడేయాలో చెప్పండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement