‘‘కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే నిడివి గురించి నాకు పెద్దగా పట్టింపులు లేవు. ఎలాంటి పాత్రైనా చేస్తాను. అలాగే ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు కూడా’’ అని అన్నారు హీరోయిన్ రుక్సార్ థిల్లాన్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. విద్యాసాగర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ.. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సందేశాత్మకంగా పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో నేను మాధవి అనే సింపుల్ గాళ్ పాత్ర చేశాను. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి. ఇదో చాలెంజ్‌లా అనిపించింది. ఇక స్క్రీన్‌పై విశ్వక్, నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దర్శకుడు విద్యాసాగర్ నాకు యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఇచ్చారు.
ఇక దర్శకులు సుకుమార్‌గారంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. యాక్టింగ్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌గార్లంటే ఇష్టం. కోవిడ్ వల్ల వరుసగా సినిమాలు చేయలేకపోయాను. రీసెంట్‌గా హిందీలో ఓ వెబ్ షో చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే. నేనూ ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నా. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు.
చదవండి: నాకు ఆశలు కల్పించి వెంటన్నే ఆ ఆశలపై నీళ్లు చల్లడం భావ్యమా?
బిగ్‌బాస్ బ్యూటీకి సల్మాన్ ఖాన్ బంపరాఫర్, ఆమె ఎంత అడిగితే అంత!
Comments
Please login to add a commentAdd a comment