
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Teaser Out: టాలీవుడ్‌కి లవర్ బాయ్‌గా పరిచమయమై మాస్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్ వంటి చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా అలరించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదటి నుంచి విభిన్నంగా చేస్తుంది చిత్రబృందం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్ ఆకట్టుకున్నాయి. 'ఓ ఆడపిల్లా' పాటతో విశ్వక్ సేన్ సరసన నటించే హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ అని రివీల్ చేశారు మేకర్స్.
తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'ఇంటర్‌క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితదారా.. ఇదే ఫస్టా' అంటూ ప్రారంభమైన సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంబాషణలు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్ చేసే ప్రయత్నాలు అలరించాయి. ఈ సినిమాతో సరైనా సమయంలో పెళ్లి చేసుకోకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో హ్యూమరస్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివరిలో విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 4న ప్రేక్షకులముందుకు రానున్నాడు ఈ గోదావరి అల్లుడు.
Comments
Please login to add a commentAdd a comment