
తాజాగా ఎట్టకేలకు మరో రిలీజ్‌డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 22న అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలవుతుందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. ఇదివరకే రిలీజైన పోస్టర్, సాంగ్స్ చూస్తుంటే పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోంది.
కాగా మార్చి 4న రిలీజ్ కావాల్సిన విశ్వక్ సేన్ ముహూర్తం బాగోలేదంటూ దాన్ని వాయిదా వేసింది. తాజాగా ఎట్టకేలకు మరో రిలీజ్‌డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 22న అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలవుతుందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మొత్తానికి సమ్మర్ రేస్‌లో దిగుతున్న విశ్వక్‌సేన్‌కు బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటున్నారు ఆయన ఫ్యాన్స్.
Bringing you, the Wholesome Entertainer for this Summer⛱️#AshokaVanamLoArjunaKalyanam
— SVCC Digital (@SVCCDigital) March 15, 2022
Releasing Worldwide on April 22nd 🎋😍#AVAKFromApril22nd@VishwakSenActor @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/nv4ajo3hXw
చదవండి: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?