
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed : 'వెళ్లిపోమాకే' సినిమాతో చిన్న హీరోగా పరిచయమై మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాందించుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు విశ్వక్. తాజాగా ఆయన నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అది కూడా విభిన్నంగా, కాస్త వినోదాత్మకంగా ట్విటర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4న పెళ్లి ముహుర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. దీంతో అల్లం అర్జున్ వివాహం వాయిదా పడినట్లే అని తెలుస్తోంది.
Allam's arrival is a lil delayed ⏸️#AshokaVanamLoArjunaKalyanam revises the release date from March 4th!
— SVCC Digital (@SVCCDigital) March 2, 2022
New Release Date Announcement soon 😊@VishwakSenActor @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/RWzp6vEzDm