
జై క్రిష్, రవికిరణ్, విద్యాసాగర్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రుక్సార్, విశ్వక్ సేన్, సుధీర్
‘‘నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయం. వారు బాధ పడే పని ఎప్పటికీ చేయను. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో పాటు బలమైన కథ, సంగీతం, పాటలు సమపాళ్లలో ఉంటాయి. వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని యువకుడైన అల్లం అర్జున్‌కుమార్ పడే బాధలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్ సేన్.
(చదవండి: విశ్వక్‌సేన్‌పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్)
విద్యాసాగర్ చింత దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో విద్యాసాగర్ చింత, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రుక్సార్ థిల్లాన్, చిత్ర కథారచయిత, షో రన్నర్ రవికిరణ్ కోలా, సంగీత దర్శకుడు జై క్రిష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment