
హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
"ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా అనే సాంగ్‌ను విడుదల చేశారు. జై క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి సానపాటి భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటను అనన్య భట్ - గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment