విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దాస్ కా దమ్కీ'. ఫలక్‌నుమా దాస్ తర్వాత స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ రూపొందిస్తోన్న సినిమా ఇది. ఇందులో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది.వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలె విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌కి సంబంధించిన ప్రోమోను వదిలారు మేకర్స్. మావా బ్రో ఇది మీకోసమే అంటూ విశ్వక్‌సేన్ ట్వీట్ చేశాడు. 'జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తున్నాడు బ్రో'.. అంటూ సాగిన ఈ పాట పూర్తిపాటను రేపు(శుక్రవారం)సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
MAWA BROS 😎 This one's for you all ❤️
— VishwakSen (@VishwakSenActor) January 19, 2023
Here's the trippy promo of our 2nd single #MawaBro 🕺
- https://t.co/c0b61bl77o
Full Lyrical out tomorrow @ 4:05PM 🎶#DasKaDhamki @Nivetha_Tweets @Ram_Miriyala @LyricsShyam @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/nL3GGluSxS
Comments
Please login to add a commentAdd a comment