విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ సేన్ దర్శకత్వంలో వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్‌పై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మావా బ్రో...’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామ్ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
‘‘ప్రతి సామాన్యునికి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంటుంది. విశ్వక్ డ్యాన్స్ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: దినేష్ కె. బాబు.
Comments
Please login to add a commentAdd a comment