
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విశ్వక్ సేన్ పాత్ర పేరు, లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో ఆయన వడ్డీ వ్యాపారీ అర్జున్ కుమార్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌బ్యూరోని సంప్రదిస్తాడు. అప్లికేషన్ ఫామ్‌లో అతని పేరు, వృత్తితో పాటు గోత్రం, బరువు అన్ని విషయాలను పొందుపరిచాడు. అలాగే కట్నం అక్కర్లేదని కూడా మెన్షన్ చేశాడు. ఫస్ట్‌లుక్ చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగనుందని అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment