బాబు భద్రతపై మరింత శ్రద్ధ | Lawyer Luthra Mulakhat with Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు భద్రతపై మరింత శ్రద్ధ

Published Thu, Sep 14 2023 3:43 AM | Last Updated on Thu, Sep 14 2023 9:55 AM

Lawyer Luthra Mulakhat with Chandrababu Naidu - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం/కంబాల­చెరువు: రాజమ­హేం­ద్ర­­వరం సెంట్రల్‌ జైల్లో రిమా­ండ్‌­లో ఉన్న చంద్రబాబు భద్రతపై జైలు అధికా­రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కోస్తాంధ్ర జైళ్ల డీజీ రవికిరణ్‌ బుధవారం సుమారు గంటపాటు జైల్లో తనిఖీలు చేశారు. బాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్‌తో పాటు భద్రతను పరిశీలించారు. జైలు అధికా­రు­లకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే చంద్ర­­బాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌ వద్ద సీసీటీవీ కెమెరాలతో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తు­న్నారు. ఆర్మ్‌డ్‌ సిబ్బంది చంద్రబాబు వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. బాబు సుముఖత వ్యక్తం చేస్తేనే ములాఖత్‌కు అనుమతి­స్తున్నారు. 

ఎలా ముందుకెళ్దాం..!
స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు తరఫున వాది­స్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బు­ధ­వారం సెంట్రల్‌ జైలులో ఆయన్ని కలిశారు. విజ­­య­వాడ నుంచి వచ్చిన ఆయన తొలుత లోకేశ్‌తో  మాట్లాడి అనంతరం జైల్లో చంద్రబాబును కలిశారు. సుమారు 40 నిమి­షాలు వారు కేసు గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైలు బయటకు వ­చ్చి­­న లూథ్రా మీడియాతో మాట్లాడ­కుండా వెళ్లిపో­యా­­రు. 

లోకేశ్‌కు రజనీకాంత్‌ ఫోన్‌..
చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు సినీ నటుడు రజనీకాంత్‌ ఫోన్‌ చేసి.. కేసు గురించి వాకబు చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్, భువనేశ్వరి బుధ­వారం రాజమహేంద్రవరంలో భేటీ అయ్యారు. 

మూడో రోజూ గడిచిందిలా..
చంద్రబాబు జైలు జీవితం గత రెండు రోజుల మాదిరిగానే మూడో రోజు కూడా సాగింది. తెల్ల­వారుజామున నిద్ర లేచిన చంద్ర­బాబు యోగా, వాకింగ్‌ చేసిన అనంతరం బ్లాక్‌ కాఫీ, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్‌ సలాడ్‌తో అల్పా­­హారం తీసుకున్నారు. మధ్యా­­హ్నం అన్నం, రెండు కూరలతో.. రాత్రికి అన్నం, పుల్కా, కూరతో భోజనం చేసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement