rajamahendravaram central jail
-
బాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు టవర్ ఏసీ సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాబు ఉంటున్న బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందులో భాగంగా ఆయన గదిలో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా బ్యారెక్‌లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు నిబంధనలు అనుమతించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైద్యుల సూచనల మేరకు తన బ్యారెక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ శనివారం రాత్రి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయాధికారి రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని వైద్యులు కోర్టుకు తెలిపారు. ఇది కాకుండా చంద్రబాబుకు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని వైద్యులను కోర్టు ప్రశ్నించింది. మరే ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం స్కిన్ అలర్జీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద వాదనలు వినిపించారు. చంద్రబాబుకున్న స్కిన్ అలర్జీ సమస్యను లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని వైద్యులు సిఫారసు చేశారని కోర్టుకు వివరించారు. న్యాయాధికారి స్పందిస్తూ.. చంద్రబాబు అభ్యర్థనపై మీరేమంటారని వివేకానందను ప్రశ్నించారు. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని వివేకానంద చెప్పారు. దీంతో న్యాయాధికారి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఎంత సేపట్లో ఏసీ సదుపాయం ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీన్ని న్యాయాధికారి రికార్డ్ చేశారు. -
బాబు ఆరోగ్యం బాగుంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఆయన వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై జీజీహెచ్ వైద్య బృందం, జిల్లా ఎస్పీ పి.జగదీష్ లతో డీఐజీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవి, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.హిమజ బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిందని వెల్లడించారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు.. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అన్నీ బాగున్నాయని చెప్పారు. తమతో ఆయన బాగా మాట్లాడారన్నారు. అన్ని విషయాలు అడిగామన్నారు. షుగర్ కూడా అదుపులోనే ఉందని తెలిపారు. చంద్రబాబు వాడుతున్న మందులను కూడా పరిశీలించామన్నారు. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. వాటికి ఆయన వాడుతున్న మందులతో పాటు తాము కొన్ని రకాల మందులు ఇచ్చామని వివరించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న మాట పూర్తిగా అసత్యమన్నారు. శరీరంపై ఉన్న దద్దుర్ల దృష్ట్యా చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని చెప్పారు. జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదన్నారు. నిత్యం జీజీహెచ్‌లో ఒక ప్రత్యేక గది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీఐజీ రవికిరణ్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఖైదీలకు ఏసీ ఏర్పాటు చేయలేదన్నారు. కాబట్టి తాము ఏసీని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. జైలు లోపల 85 ఏళ్ల వృద్ధ ఖైదీ కూడా ఉన్నారన్నారు. జైలు లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అయినందున మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జైలులో జరుగుతున్న ప్రతి విషయాన్ని కోర్టుకు నివేదిస్తున్నామని వివరించారు. రిపోర్టును బయట ఎవరికీ ఇవ్వలేదు.. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టును జీజీహెచ్ వైద్య బృందం తమకు అందించిందని డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఆ రిపోర్టును తాము బయట ఎవరికీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు తరఫున వచ్చిన లాయర్లు ఇవ్వాలని అడిగితే ఆయన అనుమతి తీసుకుని, సంతకం చేయించుకుని రిపోర్టును లాయర్లకు అందజేశామని తెలిపారు. అందులో ఒక లైనును జైలు అధికారులు బ్లాక్ మార్కర్‌తో కనిపించకుండా చేశారన్న వార్తలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ లెటర్‌పై బ్లాక్ మార్కు చేసి ఎవరు వైరల్ చేస్తున్నారో తమకు తెలియదని చెప్పారు. కాగా తమ పట్ల డీఐజీ దురుసుగా ప్రవర్తించారని లోకేశ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ములాఖత్ సమయం ముగిసిందని.. నిబంధనల ప్రకారం మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రమే చెప్పానన్నారు. చంద్రబాబును కలిసిన లోకేశ్ చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌లో కలిశారు. శనివారం మధ్యాహ్నం 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ అనంతరం వారు జైలు నుంచి నేరుగా వారు ఉంటున్న క్యాంప్‌కు వెళ్లారు. కాగా ములాఖత్‌లో లోకేశ్ డీఐజీ రవికిరణ్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును వైద్యులు సూచించిన మేరకు చల్లటి వాతావరణంలో ఎందుకు ఉంచడం లేదని నిలదీసినట్టు తెలిసింది. -
అబద్ధాలు ఆపండి.. అసలు నిజాలివీ
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచ్చీలుడని చెప్పేందుకు ఎల్లో మీడియా నానాపాట్లు పడుతోంది. ఇందుకోసం నిత్యం టన్నుల కొద్దీ అసత్య కథనాలు, అభూత కల్పనలను వండివారుస్తూ పాఠకుల మెదళ్లను కలుషితం చేస్తోంది. రాజకీయ కక్ష్యతోనే అరెస్టులు జరిగాయని, సీమెన్స్‌తో ఒప్పందం జరిగిందని, ఇందుకోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టింది నిజమని నమ్మించేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధం?.. ఆయన ఎక్కడైనా సంతకం చేశారా? ఈ ల్యాబ్‌లు పరికరాలు అన్నీ ఉత్తివేనా అంటూ శుద్ధపూసలా ప్రశ్నిస్తూ తమ బాబు అమాయకుడంటూ ప్రజలను నమ్మించేలా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్, ఈనాడు చేస్తున్న ఆరోపణలు, వాదనల్లోని నిజాలు ఏమిటంటే.. ఆరోపణ: రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబును జైలుకు పంపించారు.. వాస్తవం: చంద్రబాబును జైలుకు పంపింది ప్రభుత్వం కాదు.. కోర్టు. చంద్రబాబు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు విశ్వసించింది. అలాగే, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఎదుర్కొంటున్న అభియోగాల మీద కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై దాదాపు 10 గంటలసేపు వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదించారు. వారి వాదనలకు గౌరవ న్యాయస్థానం సంతృప్తికర స్థాయిలో సమయం ఇచ్చింది. ఇంతటి న్యాయ ప్రక్రియ తర్వాతే కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని జైలుకు తరలించాల్సి వచ్చింది. ఇందులో రాజకీయ కక్షకు, ప్రతీకారానికి ఆస్కారం ఎక్కడ? పైగా కక్ష ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేది. నాలుగేళ్లపాటు సుదీర్ఘ విచారణలో చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలను కోర్టుకు సమర్పించాకే ఆయనకు రిమాండ్ విధించారు. ఆరోపణ: రూ.371 కోట్లు ఖర్చుచేశారు కదా? పరికరాలు ఏర్పాటుచేశారు కదా? ఇకఅవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడుంది? వాస్తవం: ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఐదు విడతల్లో రూ.371 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.241 కోట్లను హవాలా మార్గంలో తరలించారు. ఆ డబ్బు తిరిగి చంద్రబాబు మనుషులకే చేరిందని ఐటీ, ఈడీ విచారణలో తేలింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పాత్రపైనా ఆధారాలు ఉండడంతో ఐటీ శాఖ నోటీసులిచ్చింది. అందుకే డిజైన్‌టెక్, షెల్ కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీ, ఈడీ అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సమాచారమిచ్చినా చంద్రబాబు మౌనం దాల్చడం, చంద్రబాబే సూత్రధారి అనేందుకు నిదర్శనం. ఆరోపణ: ఏపీతో ఒప్పందానికి సీమెన్స్ ఆసక్తి అంటూ ప్రచారం. గతంలో డిజైన్‌టెక్‌కు పంపిన ఈ–మెయిల్స్‌లో సీమెన్స్ వైస్ ప్రెసిడెంట్ పెట్ క్యారియర్ వెల్లడి అంటూ ఈనాడు రాతలు.. వాస్తవం: తమకు తెలియకుండానే భారత్‌లో తమ కంపెనీ ప్రతినిధి కొందరితో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును చేపట్టారని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018లో సీమెన్స్ సంస్థ తన ఇంటర్నల్ ఆడిట్ రిపోర్టులో తేల్చిచెప్పింది. సీమెన్స్ విచారణాధికారులు మూస్మా యెర్ క్లాస్, ఎస్. రాబర్ట్ ఈ నివేదిక ఇచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వలేదని కూడా విచారణాధికారికి స్పష్టంచేశారు. అలాగే, సీమెన్స్ ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వానికి ఈ స్కాంపై ఓ సామాజిక కార్యకర్త సమాచారమిస్తే దాన్ని పక్కనపెట్టేశారు. ఇదంతా దురుద్దేశపూరితం కాదా? ఆరోపణ: ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సంతకాలు ఎక్కడైనా పెట్టారా? పెడితే చూపించండి అంటూ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో లోకేశ్ సవాల్.. వాస్తవం: ఒకచోట కాదు.. మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారు. రూ.371 కోట్ల విడుదల దగ్గర నుంచి ప్రతిచోటా కూడా సంతకాలు పెట్టారు. ఉదా.. ఆర్థిక శాఖ ఫైలులోని ఎనెగ్జర్–1 పేజి నంబర్ ౖ42లో చంద్రబాబు సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్ పేజ్ నంబర్–15లో గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కార్యదర్శిగా నియమిస్తూ సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్–1, పేజి–11లో డిప్యూటీ సీఈఓగా అపర్ణను నియమించారు. సీమెన్స్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన జీవీఎస్ భాస్కర్ భార్యే అపర్ణ. ఆరోపణ: పరికరాలు, ఫలితాలు అన్నీ అబద్ధాలేనా అన్న లోకేశ్.. వాస్తవం: రూ.371 కోట్లలో రూ.241 కోట్లు తినేసి, మిగతా డబ్బుతో మమ అనిపించేసి, వీటికి రూ.3,300 కోట్లు ఖర్చుచేశారంటే నమ్మాలా? అందులోనూ తప్పుడు బిల్లులు, రశీదులు ఉన్నాయి. వాడిన సాఫ్ట్వేర్ విలువకు నిర్ధారణే లేదు. వాటి విలువను నిర్ధారించే సామర్థ్యం తమకులేదని సీఐటీడీ విచారణలో చెప్పింది కూడా. మరి పరికరాలున్నాయి? ఫలితాలు వచ్చేశాయి? అని మాయమాటలు చెప్పడం దేనికి? ఆరోపణ: 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం.. ఇందులో 80 వేల మందికి ఉద్యోగాలిచ్చామంటూ లోకేశ్, ఈనాడు బాకా.. వాస్తవం: లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటూ ఈనాడు, లోకేశ్, టీడీపీ చెప్తున్న మాటల్లో అంతా డొల్లతనమే. విహార యాత్ర పేరుతో బీసీ వెల్ఫేర్ స్కూళ్ల విద్యార్థులను తరలించి, వారికి శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు. శిక్షణ ఇచ్చామన్న వారిలో 70,000 మంది స్కూల్ పిల్లలున్నారు. శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారుచేసి నిధులు స్వాహా చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో సగానికి పైగా ల్యాబ్‌లు ఏర్పాటుకాలేదు. దీన్నిబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎంత బూటకమో అర్థమవుతోంది. ఆరోపణ: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐటీడీ కన్నా ప్రైవేటు సంస్థే ముద్దా? అంటూ ఈనాడు కథనం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మదింపులో సీఐటీడీ నివేదికను పరిగణలోకి తీసుకోరా? ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ నివేదికను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఈనాడు ప్రశ్నలు.. వాస్తవం: ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుపై తాము ఇండిపెండెంట్ మదింపు చేయలేదని సీఐటీడీ స్పష్టంచేసింది. ఒక్కో కోర్సుకు, ఒక్కో స్టూడెంటుకు ఎంత ఖర్చవుతుందో సీమెన్స్ చెప్పిన వివరాల ఆధారంగా యథాతథంగా సంతకం చేశామని విచారణలో స్పష్టంచేసింది. సాఫ్ట్వేర్ విలువను మదింపు చేసే సామర్థ్యం తమకులేదని కూడా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని.. కానీ, తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని ఏపీఎస్ఎస్డీసీ కోరనేలేదని సీఐటీడీ విచారణలో వెల్లడించింది. మదింపు నివేదిక ఇవ్వాలంటూ సీఐడీటీని ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 5న కోరగా 2016 మార్చి 22న నివేదిక ఇచ్చింది. కానీ, ఆ నివేదికతో నిమిత్తం లేకుండానే, అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. ఈ విధంగా రూ.337 కోట్లు డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఇచ్చేశారు. చివరగా.. 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. ఇలా డబ్బులన్నీ ఇచ్చేశాక మదింపు నివేదిక కోరడం ఏమిటి? కోరిన రోజే రూ.185 కోట్లు విడుదల చేయడం ఏంటి? ఇదంతా నిబంధనలకు విరుద్ధం కాదా? ఆరోపణ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లాంటిదే గుజరాత్‌లోనూ, తమిళనాడులోనూ కూడా చేశారు కదా? అక్కడలేని తప్పు ఇక్కడేముంది? వాస్తవం: ఏపీలో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546.84 కోట్లు, ఇందులో ప్రభుత్వ వాటా రూ.55 కోట్లు. టెక్ కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండానే రూ.371 కోట్లు విడుదల చేశారు. అదే గుజరాత్లో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.17.1 కోట్లు, ప్రభుత్వ వాటాగా సుమారు రూ.188 కోట్లు విడుదల చేశారు. తమిళనాడులో ఒకే ఒక్క యూనివర్సిటీలో మాత్రమే చేశారు. ఆరోపణ: సీమెన్స్ ప్రాజెక్టు నిజం.. సాఫ్ట్వేర్ హార్డ్‌వేర్ ఇచ్చింది వాస్తవం.. ఆరు క్లస్టర్లకు వాటా విలువ రూ.3,356 కోట్లపైనే. ఒక్కో క్లస్టర్లో పరికరాల విలువ రూ.559 కోట్లు.. అయినా నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.. వాస్తవం: సీమెన్స్ ప్రాజెక్టు పక్కా అబద్ధం. అసలు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ తన ఇంటర్నల్ రిపోర్టులోనూ, విచారణాధికారితోనూ స్పష్టంచేసింది. రూ. 3,300 కోట్ల ప్రాజెక్టు అని, 90% సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా, 10% ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జీఓలో రాశారు. కానీ, దీనికి భిన్నంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే వాటాను ఆర్థిక సహాయంగా పేర్కొన్నారు. ఒప్పందంలో ఎక్కడా కూడా ఏ లెటర్ ఆధారంగా చేస్తున్నారో, తేదీ ఏంటో కూడా పేర్కొనలేదు. ఒప్పందంలో భాగస్వాములైన సీమెన్స్, డిజైన్‌టెక్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా, నిబంధనలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు నిధులు విడుదల చేశారు. అంతేకాక.. తాను ఎంపిక చేసుకున్న గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తికి కీలక హోదాలను కట్టబెట్టారు. పరికరాల కొనుగోలు కోసం రూ.58 కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా అందలేదని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న స్కీమే తమ వద్దలేదని సీమెన్స్ సంస్థ స్పష్టంచేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో ఏ రాష్ట్రంలో కూడా తాము ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పింది. అలాంటప్పుడు సీమెన్స్ ప్రస్తావన ఎందుకొస్తుంది? -
ముసుగు తీసిన చంద్రసేనాని
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం–జనసేన మధ్య బంధానికి ఉన్న ముసుగు తొలగిపోయింది. కొత్తగా పొత్తు పొడుస్తున్నట్లు పవన్‌కళ్యాణ్ పాతపాటనే కొత్తగా పాడారు. చంద్రబాబు చాటుగా ఇన్నేళ్లు ఒదిగి ఉన్న జనసేన అధ్యక్షుడు తాజాగా పొత్తు ప్రకటనతో పాత పాటకు కొత్త పల్లవి అందుకున్నారు. పాత బంధాన్నే కొత్త పొత్తుల రాగంగా ఆలపించేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పొత్తుల ప్రకటన వరకు చంద్రబాబు చెంతనే పవన్ అతిథి రాజకీయ నాయకుడి పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చి.. చంద్రబాబు రాసిన స్క్రీన్ ప్లేను పక్కాగా రక్తి కట్టించారు. ప్రశ్నించేందుకే జనసేన అంటూ డబ్బాలు కొట్టుకుని.. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా అధికారులపై దాడులు, ప్రకృతి వనరుల దోపిడీ, ఇచ్చిన వందల హామీలను నెరవేర్చకపోయినా ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా నాలుగేళ్లు పత్తా లేకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండగా చంద్రబాబుకు మేలు చేసేందుకు మళ్లీ తెరపైకి వచ్చారు. అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే కుయుక్తిలో భాగంగానే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు నాటకమాడారు. చివరికి ప్రజా క్షేత్రంలో చావు దెబ్బ తినడంతో మళ్లీ టీడీపీతో అంటకాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశంతో బంధాన్ని కొనసాగిస్తూనే తన పార్టీ కార్యకర్తలను, ప్రజలను మోసగించారు. గతంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించిన నోటితోనే ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయ పయనం చేస్తానంటూ ప్రకటించడం పవన్ రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటి చెబుతోంది. సమష్టిపోరు అవసరమట! స్కిల్ స్కామ్‌లో అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబును పరామర్శించిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ, జనసేన పొత్తు ఉందంటూ పవన్ చెప్పడం చూస్తుంటే.. జైలు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు అవగతమవుతోంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని.. బీజేపీ కూడా మా వెంట వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ కలరింగ్ ఇచ్చారు. చంద్రబాబుతో విభేదించి గతంలో ప్రత్యేకంగా పోటీ చేశానని, వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలంటే సమష్టిపోరు అవసరం అంటూ తమ బంధాన్ని బయటపెట్టారు. చంద్రబాబుతో పవన్, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ గురువారం ఉదయం ములాఖత్ అయ్యారు. ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పవన్, లోకేశ్, బాలకృష్ణ 40 నిమిషాలపాటు బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారని విమర్శించారు. మోదీ పిలిస్తేనే వెళ్లాను.. ‘జనసేన ఆవిర్భావ సభలో సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. మా నాన్న ఆస్థికలు కాశీలో కలిపేందుకు వెళ్లిన సమయంలో ముంబయిలో తాజ్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. అంతకు ముందు పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలను చూసి దేశానికి సమర్థుడైన నాయకుడు కావాలని మోదీకి మద్దతు తెలిపిన విషయంలో నన్ను అందరూ తిట్టారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గనని వెల్లడించా. ఏ రోజైనా నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే వెళ్లానే తప్ప.. నేనంతకు నేనే ఎప్పుడూ వెళ్లలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. బాబుకు నాకు మధ్య పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి. కానీ, ఆయన అనుభవం, సమర్థతపై పూర్తి విశ్వాసం ఉంది’ అని పవన్ స్పష్టం చేశారు. సైబరాబాద్ నిర్మిచిన వ్యక్తికి రూ.300 కోట్ల స్కామ్‌ను అంటగడతారా? అని ప్రశ్నించారు. ‘బాబును ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారించాల్సింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తోంది? అభియోగాలు అంటగట్టిన వ్యక్తి ఏమైనామహానుభావుడా? వాజ్‌పేయా? లాల్ బహదూర్శాస్త్రినా? కేసులు, రాజ్యాంగ ఉల్లంఘన, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి మద్యపాన నిషేధం చేస్తాడా?’ అని దుయ్యబట్టారు. అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదు రాష్ట్రంలో అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదని పవన్ మండిపడ్డారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు వద్ద మూడు వేల కిలోల హెరాయిన్ దొరికితే దాని మూలాలు విజయవాడలో తేలాయని.. వీటిపై మీడియాలో వార్తలే రాకుండా చేశారని చెప్పారు. ‘అడ్డగోలు దోపిడీ చేస్తే ఎవరూ ప్రశ్నించకూడదా? నన్ను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆపేస్తానంటావు, ఆ హక్కు నీకు ఉందా?’ అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తుడైన సీఎం వైఎస్ జగన్.. తాను కోనసీమ పర్యటనకు వెళ్తే 2 వేల మంది క్రిమినల్స్‌ను దాడికి దించారన్నారు. బాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా ఎన్నడూ వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు అరెస్టయితే వైఎస్సార్సీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారని చెప్పారు. విడివిడిగా ఎదుర్కోవడం కష్టం సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం కష్టమని.. జనసేన, టీడీపీ కలిసి సమష్టిగా పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. 2019లో వేర్వేరుగా పోటీ చేసి నష్టపోయామని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీట్ల విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. జైల్లో చంద్రబాబు భద్రత విషయమై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తానన్నారు. మేం అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలం ‘వైఎస్సార్సీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందు ఆలోచించుకోవాలి. మేం అధికారంలోకి వస్తే మాపై రాళ్లు వేసిన వారెవరినీ వదలం. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. డీజీపీ, సీఎస్‌తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగతోడే అవకాశం ఉంది. చట్టాలను అధిగమించే అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లిని, తల్లిని వదిలేసిన వ్యక్తి, బాబాయిని చంపించిన వ్యక్తిని అధికారులు నమ్ముకుంటున్నారు. మీకు రేపు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఆలోచించుకోండి. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే’ అని పవన్ అధికారులు, పోలీసులను హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులు తప్పులు సరిదిద్దుకునేందుకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. యుద్ధం కావాలంటే సిద్ధంగా ఉంటామని ఆవేశంతో ఊగిపోయారు. -
బాబు భద్రతపై మరింత శ్రద్ధ
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు భద్రతపై జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కోస్తాంధ్ర జైళ్ల డీజీ రవికిరణ్ బుధవారం సుమారు గంటపాటు జైల్లో తనిఖీలు చేశారు. బాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్‌తో పాటు భద్రతను పరిశీలించారు. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ వద్ద సీసీటీవీ కెమెరాలతో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆర్మ్డ్ సిబ్బంది చంద్రబాబు వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. బాబు సుముఖత వ్యక్తం చేస్తేనే ములాఖత్‌కు అనుమతిస్తున్నారు. ఎలా ముందుకెళ్దాం..! స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బుధవారం సెంట్రల్ జైలులో ఆయన్ని కలిశారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన తొలుత లోకేశ్‌తో మాట్లాడి అనంతరం జైల్లో చంద్రబాబును కలిశారు. సుమారు 40 నిమిషాలు వారు కేసు గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైలు బయటకు వచ్చిన లూథ్రా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్‌కు రజనీకాంత్ ఫోన్.. చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు సినీ నటుడు రజనీకాంత్ ఫోన్ చేసి.. కేసు గురించి వాకబు చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్, భువనేశ్వరి బుధవారం రాజమహేంద్రవరంలో భేటీ అయ్యారు. మూడో రోజూ గడిచిందిలా.. చంద్రబాబు జైలు జీవితం గత రెండు రోజుల మాదిరిగానే మూడో రోజు కూడా సాగింది. తెల్లవారుజామున నిద్ర లేచిన చంద్రబాబు యోగా, వాకింగ్ చేసిన అనంతరం బ్లాక్ కాఫీ, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్‌తో అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్నం అన్నం, రెండు కూరలతో.. రాత్రికి అన్నం, పుల్కా, కూరతో భోజనం చేసినట్లు తెలిసింది. -
చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. బాబును కలిసేందుకు జైలు అధికారులు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తొలుత రాజమహేంద్రవరంవిద్యానగర్లో లోకేశ్ ఏర్పాటు చేసుకున్న క్యాంప్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి లోకేశ్‌తో కలిసి సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ జైల్‌కు సొంత వాహనంలో చేరుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి 30నిమిషాలు బాబుతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, బెయిల్, కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది : భువనేశ్వరి చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ధైర్యంగా ఉన్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కట్టించిన బ్లాక్‌లోనే ఆయన్ని కట్టిపడేశారని అన్నారు. ఆయనకు నంబర్ వన్ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి అక్కడ లేదన్నారు. బాబు భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆయన్ని విడిచి బయటకు వస్తుంటే తనలో ఏదో భాగం వదిలేసిన భావన కలుగుతోందని అన్నారు. ప్రజలు, రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉండాలని చంద్రబాబు నిరంతరం పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధేసిందని, అక్కడ కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం ఆలోచించే బాబు కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు, కేడర్ కోసం నిలడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో భువనేశ్వరితో పాటు లోకేశ్, బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది భేటీ చంద్రబాబును హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ జైలులో కలిశారు. ఇద్దరూ కేసుకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ వేయడం, సీఐడీ కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై వారు చర్చించినట్లు తెలిసింది. రెండో రోజు జైలులో ఇలా.. చంద్రబాబు జైలు జీవితం మంగళవారం రెండో రోజుకు చేరింది. తొలి రోజులాగే రెండో రోజు సైతం వీఐపీ ఖైదీకి అందించే సదుపాయాలన్నీ అందించారు. చంద్రబాబు తొలి రోజు యోగా మాత్రమే చేశారు. మంగళవారం ఉదయం 4 గంటలకే నిద్ర లేచి యోగాతోపాటు వాకింగ్ కూడా చేసినట్లు సమాచారం. అనంతరం మూడు ప్రధాన పత్రికలు తెప్పించుకుని క్షుణ్ణంగా చదివారు. ఆ తర్వాత ఆల్పాహారం, టీ తాగారు. మధ్నాహ్నం, సాయంత్రం పుల్కా, కర్డ్ రైస్ తీసుకున్నట్లు తెలిసింది. స్నేహ బ్లాక్‌కు అదనపు సీసీ కెమెరాల నిఘా బాబుకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన ఉన్న స్నేహ బ్యారక్ వద్ద ప్రస్తుతం ఉన్న వాటితోపాటు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. 1 + 4 భద్రత ఇస్తున్నారు. ఇతర ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జైలు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అధికారులు అక్కడ వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. స్నేహ బ్యారక్ ఎదురుగానే 24 గంటలూ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు వైద్య సిబ్బందికి విధులు కేటాయించారు. జైలు లోపలే కాదు.. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా జైలు బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
చంద్రబాబుకు జైలే భద్రం
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని రాష్ట్ర జైళ్ల శాఖ పేర్కొంది. ఆయనకు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టంచేసింది. సెంట్రల్ జైల్లో తనకు భద్రత, ఆరోగ్యపరమైన ప్రమాదం ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ చంద్రబాబు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కల్పించిన భద్రత, వైద్య ఏర్పాట్లను వివరిస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హరీశ్‌కుమార్ గుప్తా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ వివరాల ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు కల్పించిన భద్రత, వైద్యపరమైన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా ఒక బ్లాక్‌లో వార్డ్ (గది) కేటాయించారు. ఆ బ్లాక్ ప్రధాన జైలుకు విడిగా ప్రత్యేకంగా ఉంటుంది. ♦ ఆ బ్లాక్‌ను, చంద్రబాబు ఉండే గదిని పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రపరిచారు. ♦ చంద్రబాబు ఉండే గది బయట సాయుధులైన సిబ్బందితో భద్రత కల్పించారు. 24 గంటలు భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతానికి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు. ♦ చంద్రబాబు సమ్మతిస్తేనే ఆయన్ని కలిసేందుకు ఎవరినైనా అనుమతిస్తున్నారు. ♦ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ♦ ఆ గది బయట, చుట్టూ సీసీటీవీలు ఏర్పాటు చేసి 24 గంటలు భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ♦ ఆ ప్రత్యేక గదికి సమీపంలోనే వైద్యబృందం 24 గంటలు అందుబాటులో ఉంది. ♦ న్యాయస్థానం ఆదేశాలమేరకు చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించి, తగిన వైద్యసేవలను అందుబాటులో ఉంచారు. -
రెండోరోజు చంద్రబాబు జైలు జీవితం
-
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
ఇద్దరు భార్యలను హింసించి జైలుకు.. ఆపై
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ కళ్యాణం వెంకన్న మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల మేరకు.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన వెంకన్నకి ఇద్దరు భార్యలు. వీరిపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఇతనిపై అభియోగం. చిత్రహింసలకు గురిచేస్తూ సెల్ఫోన్లో చిత్రీకరించేవాడు. ఆ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ చేశాయి. అతను పెట్టే బాధలు భరించలేక ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతూరు పోలీసులు ఏప్రిల్ 19వ తేదీన నిందితుడ్ని అరెస్టు చేశారు. సెంట్రల్ జైలుకి రిమాండ్‌కు తరలించారు. జైలులో అతను మంగళవారం ఉదయం స్నానాల గదిలో మెడకు టవల్ చుట్టుకుని మృతి చెంది ఉండడాన్ని సహచర ఖైదీలు గమనించి జైలు అధికారులకు తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర
సాక్షి, మచిలీపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణతోపాటు మరో మైనర్ని కూడా ప్రత్యేక బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు. మచిలీపట్నంలోని సబ్ జైలులో సరైన సౌకర్యాలు లేనందున.. నిందితులను రిమాండ్ నిమిత్తం నేరుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది కోరగా.. జడ్జి తోసిపుచ్చారు. సోమవారం మరోసారి కొల్లు తరఫు న్యాయవాదులు ఇదే విషయమై సబ్ జైలర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి సమర్పించగా.. ఆయన కోర్టుకు రిఫర్ చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.శ్రీనివాస్ దానిపై సానుకూలంగా స్పందిస్తూ.. నిందితుల్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేందుకు అనుమతిచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య కొల్లు రవీంద్రతోపాటు మిగిలిన నిందితులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. (‘పేరు బయటకు రాకుండా మర్డర్ ప్లాన్’) -
అస్వస్థతతో రిమాండ్ ఖైదీ మృతి
వివిధ కేసుల్లో నిందితుడు గంజాయి అక్రమ రవాణాలో ఇటీవలే చిక్కాడు రాజమహేంద్రవరం క్రైం : గంజాయి కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ గురువారం అస్వస్థతతో మృతి చెందాడు. అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి(63)ని ఈనెల 24వ తేదీన గంజాయి కేసులో రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 26వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. సత్యనారాయణకు వైద్య సదుపాయం అందించాలని కోర్టు ఆదేశించడంతో అతనిని 27వ తేదీ మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీల వార్డుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున 4.38 గంటలకు గుండె పోటుతో సత్యనారాయణరెడ్డి మృతి చెందాడు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛాతిపై గాయం గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి ఛాతిపై చిన్న గాయాన్ని గుర్తించారు. మృతుడి వంటిపై పలు గాయాలు ఉండడంతో అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిందితుడి బంధువులు నోరు మెదపడం లేదు. బెయిల్‌పై బయటకు వచ్చి.. గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి వివిధ కేసుల్లో నిందితుడు. గంజాయి కేసులే కాకుండా కిడ్నాప్ కేసు కూడా ఇతనిపై నమోదైంది. జగ్గంపేట పోలీసు స్టేషన్లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో 2008లో సత్యనారాయణరెడ్డికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిం చారు. సొంత బావమరదిని కిడ్నాప్ చేసిన కేసులో ఇతను ప్రధాన నిందితుడు. 2012 జూలై 6న అనపర్తి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. Výæంజాయి కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై విడుదలైన అతను మళ్లీ అదే వ్యాపారం చేపట్టాడు. ఈ నెల 24వ తేదీన కడియం మండలం జేగురుపాడు వద్ద అక్రమంగా గంజాయిని పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు ఐషర్ వ్యాన్లు, ఒకలారీ, రెండు కార్లను, రెండు కేజీల చొప్పున 158 పాలి థిన్ ప్యాకెట్లలో ఉన్న రూ. 1.50 కోట్ల విలువ చేసే 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ రెడ్డి గుంటూరు జిల్లా నర్సరావుపేటమండలం రామిరెడ్డిపేటకు చెంది న పాములపర్తి శ్రీనివాసరావు అనే మధ్యవర్తి ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్‌కు గంజాయి పంపిస్తున్నాడు. ఈ కేసులో నర్సరావుపేటకు చెందిన షేక్ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మూరు కాలనీకి చెందిన చోడవరపు రాజేష్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల
రాజమహేంద్రవరం : కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 10 మందిలో 8 మంది శనివారం రాత్రి 7.15 గంటలకు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు బాధ్యులను చేస్తూ 13 మందిని పోలీసులు అరెస్టు చేయగా వారిలో పది మందిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. వారిలో లగుడు శ్రీనివాస్‌ను సీబీ సీఐడీ రిమాండ్‌కు తీసుకువెళ్ళగా, కూరాకుల పుల్లయ్యకు సంబంధించిన బెయిల్ పేపర్లలో తేడాలు రావడంతో విడుదల చేయలేదు. మిగిలిన 8 మంది గణేషుల రాంబాబు, గణేషుల లక్ష్మణరావు, చక్కపల్లి సత్తిబాబు, పల్లా శ్రీహరిబాబు, దూడల మునీంద్ర, లక్కింశెట్టి గోపీ మహేష్, ముదిగొండ పవన్‌కుమార్, నక్కా సాయిలను విడుదల చేశారు. వారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు.