రూరల్‌ యాక్షన్‌కి సై | Vijay Devarakonda next film is with director Ravi Kiran Kola | Sakshi
Sakshi News home page

రూరల్‌ యాక్షన్‌కి సై

Published Sun, May 5 2024 1:27 AM | Last Updated on Sun, May 5 2024 1:27 AM

Vijay Devarakonda next film is with director Ravi Kiran Kola

హీరో విజయ్‌ దేవరకొండ అంటే సిటీ బ్యాక్‌డ్రాప్‌ కథలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలని ఓ రూరల్‌ యాక్షన్‌ డ్రామా మూవీ సైన్‌ చేశారు. ఈ సినిమా కోసం సిటీ నుంచి విలేజ్‌కి వెళ్లనున్నారు విజయ్‌ దేవరకొండ. అక్కడే ఫుల్‌ యాక్షన్‌ చేయనున్నారు.

ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ మూవీని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మించనున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement