Actress Sandhya Rani And Her Family Visits Arasavalli Temple, Details Inside - Sakshi
Sakshi News home page

Sandhya Rani: ఆదిత్యుని సన్నిధిలో నటి సంధ్య

Published Wed, Apr 13 2022 11:24 AM | Last Updated on Wed, Apr 13 2022 12:24 PM

Actress Sandhya Rani Family Visits Arasavalli Temple - Sakshi

సాక్షి, అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని వర్థమాన సినీ నటి సంధ్యారాణి రావిపల్లి మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీధి బాలలం, అమ్మవారి మహత్యం, 1997 (ఇది జరిగిన కథ), ‘పద్మశ్రీ’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించినట్లు తెలిపారు.

హీరో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’లో కీలక పాత్ర చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 16 సినిమాలు, రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన ‘కడప’ అనే వెబ్‌సిరీస్‌లో నటించినట్లు తెలిపారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ చిత్రం, రావురమేష్‌తో ‘వెల్లువ’ అనే సినిమాలో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ తేజ్‌ హీరోగా చేస్తున్న మూవీలో కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు.

చదవండి: దారుణ కామెంట్లు, అషూ, అజయ్‌లను తిట్టిపోస్తున్న నెటిజన్లు

హిందీ సినిమాలు సౌత్‌లో ఎందుకు ఆడవో! అన్న సల్మాన్‌ కామెంట్లపై యశ్‌ స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement