సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం". తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా.. ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్ వచ్చేస్తోంది.
ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.
శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా' సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్‌తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.
ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment