
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కార్తీకమాసం అందునా ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 5 గంటలు సమయం పడుతుంది.
పుణ్య స్నానాలు చేయటానికి పాతాళగంగ వద్ద భక్తులు వేచి ఉండే పరిస్థితి ఏర్పాడింది. అలాగే శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు ఆలయం వెలుపుల కూడా బారులు తీరారు.