శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్యక్షేత్రంలో శ్రీసూర్య నారాయణ స్వామి కళ్యాణోత్సవం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.
శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం కల్యాణాంగ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీసూర్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆలయప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ కాశ్యల నేతత్వంలో ప్రారంభమయ్యాయి.
16న సుగంధద్రవ్య మర్థన (కొట్నం దంపు), ఈనెల 17వ తేదీన ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 22వ తేదీ వరకు జరగనున్న కల్యాణవేడుకల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అర్చకులు పేర్కొన్నారు.