శ్రీకాకుళం: కమాండెంట్‌ను ఆశీర్వదిస్తున్న ప్రధాన అర్చకులు
శ్రీకాకుళం : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకున్నారు. అలాగే సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ జయప్రకాష్‌ఆజాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు జడ్జి బాలయోగి తోపాటు, జిల్లా జడ్జి నిర్మలా గీతాం బ, తహసీల్దార్ మురళీకృష్ణ కూడా ఉన్నారు. ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు.
ముఖలింగేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని ఉమ్మడి రాష్టాల హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి.. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న దేవతా విగ్రహాలకు పూజలు, వారాహి అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ శిఖరం దర్శనం చేయించి స్వామివారి చరిత్రతో పాటు ఆలయ విశేషాలు వివరించారు. అలాగే స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, అడిషనల్ సబ్ జడ్జి వివేకానంద, కోటబొమ్మాళి జడ్జి కె.ప్రకాశ్‌బాబు, పర్యవేక్షకులు టి.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, ఈఓ వీవీఎస్ నారాయణ, ఎస్‌ఐ ఎం.గోవింద, అర్చక సంఘం అధ్యక్షుడు టీ.పెద్దలింగన్న, అర్‌ఐ చిన్నారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment