నేడు ఆదిత్యునికి కిరణ స్పర్శ
Published Tue, Oct 1 2013 5:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
అరసవల్లి, న్యూస్‌లైన్: ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని నేడు సూర్యకిరణాలు తాకనున్నాయి. భానుడి లేలేత కి రణాలు తాకినపుడు బంగారు ఛాయలో మెరిసిపోతూ ఆదిత్యుడు భక్తులకు దర్శనమిస్తాడు. 1,2,3 తేదీల్లో మూడు రోజులపాటు ఈ అపురూప దృశ్యం కనువిందు చేయనుంది.
ఈ కమనీయ దృశ్యాన్ని కనులారా వీక్షించడానికిజిల్లా నుంచే కాకుండా రాష్ట్ర, దేశ నలు మూలల నుంచి భక్తులు అరవసల్లికి తరలి రానున్నారు. మంగళవారం ఉదయం 6.05 గంటలకు కిరణ స్పర్శ ప్రారంభమవుతుంది. సుమారు 5 నుంచి 8 నిమిషాల వరకు కిరణ స్పర్శ దర్శనభాగ్యం లభిస్తుంది.
అయితే మబ్బులుగా ఉండి, వర్షం పడితే కిరణాలు తాకే అవకాశం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. పెద్ద సంఖ్యలో రానున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Advertisement