మెరిసిన మూలవిరాట్ | Mulavirat Arasavalli Sri SuryaNarayana Swamy | Sakshi
Sakshi News home page

మెరిసిన మూలవిరాట్

Published Thu, Mar 12 2015 2:58 AM | Last Updated on Mon, Aug 20 2018 4:00 PM

Mulavirat Arasavalli Sri SuryaNarayana Swamy

 వరుసగా రెండోరోజూ సూర్య కిరణాలు  ఆదిత్యుని మూలవిరాట్‌ను స్పృశించి  భక్తులను పరవశింపజేశాయి. తొలిరోజు  సోమవారం మంచుతెరలు అడ్డుకున్నా... మంగళ, బుధవారాల్లో కిరణ స్పర్శను పెద్ద సంఖ్యలో భక్తులు కనులారా వీక్షించారు.
 
 శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూలవిరాట్‌ను రెండో రోజూ కూడా సూర్యకిరణాలు తాకడంతో భక్తులు భక్తి పరవశ్యాన్ని పొందారు. బుధవారం ఉదయం 6.20 గంటల సమయంలో ప్రారంభమైన కిరణాల ప్రసారం ఐదు నిమిషాల పాటు జరిగింది. తొలిరోజైన సోమవారం మేఘాల కారణంగా కిరణస్పర్శ జరగలేదు. బుధవారం ధ్వజస్తంభం కుడి పక్కనుంచి వచ్చిన కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడంతో బంగారు ఛాయలో మెరిసిపోయారు. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. డీఆర్వో హేమసుందరరావు, ఏసీబీ డీఎస్పీ రంగరాజు, విజయనగరం ఏపీఏస్పీ ఐదో బెటాలియన్ లెఫ్ట్‌నెంట్ కమాండర్ సుధాకర్, సింహాచలం దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు కృష్ణమాచార్యులు కిరణ స్పర్శను చూసేందుకు ఆసక్తి చూపారు. భక్తులు అధికంగా తరలిరావడం..స్వల్ప తోపులాట చోటుచేసుకోవడంతో బారికేడ్లు పడిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement