– వివాహాల నమోదు తప్పని సరి
– ఈసీ నకలుకు మీసేవ.. నగదు చెల్లింపులకు ఈ– చలానా
– జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు
కర్నూలు (టౌన్): రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనవసర జాప్యాన్ని సహించమని.. అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తప్పవని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు హెచ్చరించారు. డబుల్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టం 22 (బి) ని అమలో్లకి తీసుకువచ్చిందని ఆయన వెల్లడించారు. శనివారం స్థానిక ఆ శాఖ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
ఆస్తులు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పని సరి:
ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేసి మోసపోవద్దు. ముందుగా ఈసీ నకలు తీసుకొని చూడాలి. ఏవైన సందేహాలు ఉంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌లను సంప్రదించాలి. ఉమ్మడి కుటుంబాలు తగాదాలు పడకుండా ఆస్తిని భాగపరిష్కారాలు చేసుకోవడం మంచిది.
వివాదాస్పద, నిషేధిత ఆస్తులతో అన్ని ఇబ్బందులే
వివాదాస్పద, నిషేధిత ( దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, క్రైస్తవ సంస్థలు) ఆస్తులు కొనుగోలు చేయరాదు. తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీలునామాతో ఆస్తులను తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే డబ్బును రిజిస్ట్రార్ అయిన చిట్ ఫండ్ కంపెనీల్లో మాత్రమే పొదుపు చేసుకోవాలి.
వివాహాల రిజిస్ట్రేషన్ తప్పని సరి
ప్రేమ పెళ్లిలు చేసుకున్న వారే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది సరి కాదు. నిర్బంధ వివాహా చట్టం ద్వారా ప్రతి పెళ్లిని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 40 నుంచి 50 సంవత్సరాల క్రితం జరిగిన వివాహాల విషయంలో కూడా తగు ఆధారాలు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పని సరి.
మీ –సేవ, ఈ– చలానాలను సద్వినియోగం చేసుకోండి
దస్తావేజుల కోసం చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను ్చp.ట్ఛజజీట్టట్చ్టజీౌn.జౌఠి.జీn లో చలానాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న బ్యాంకులో్ల ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారికి ఆన్‌లైన్ ద్వారా సమాచారం చేరుతుంది. నకలు, ఈసీ, మ్యారేజ్ సర్టిఫికెట్ల కోరకు చెల్లించాల్సిన రుసుమును ఈ– పోస్ మిషన్, ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
పనుల్లో జాప్యం జరిగితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు
కల్లూరు, కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనుల్లో జాప్యం జరిగినా.. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నా మాకు ఫిర్యాదు చేసే్త సంబందిత ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. కంప్యూటర్ సిబ్బంది, మధ్యవర్తులు, అనధికార వ్యక్తుల జోక్యంపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.