- వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ
ప్రజలను రక్షించేందుకు సిద్ధం..
Published Thu, Sep 29 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
ఏటూరునాగారం : ఏజెన్సీలో ఆపదలో ఉన్న ప్రజలను రక్షించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీఐజీ రవివర్మ అన్నారు. మండలంలోని ముల్లకట్ట హైవే బ్రిడ్జి, పుష్కరఘాట్, రామన్నగూడెం గోదావరి నది ప్రవాహాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రామన్నగూడెం పంచాయతీ కారోబార్ వెంకటేశ్వర్లను వదర ఉధృతి పెరిగే వచ్చే నష్టాలు, ప్రజల ఇబ్బందులను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. 1986 వరద ఉధృతితో మండలం అతాలకుతలం అయ్యిందని సీఐ రఘుచందర్ డీఐజీకి వివరించారు. కరకట్ట నిర్మాణం లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండేదని ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వెల్లడించారు. అలాగే కరకట్ట పటిష్టత, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పరవళ్లు
ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల ద్వారా నీటిని విడుదల చేయడంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 7.66 మీటర్లకు చేరింది. ఉదయం 6 గంటలకు 8 మీటర్లకు చేరగా, క్రమంగా తగ్గింది. అయితే మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. తహశీల్దార్ నరేందర్ రామన్నగూడెం ఘాట్‌ను సందర్శించి మొదటి, రెండు, మూడో ప్రమాద హెచ్చరిక మీటర్లను ఏర్పాటు చేయించారు. తహశీల్దార్ వెంట ఆర్‌ఐ సర్వర్‌పాషా, వీఆర్వో నర్సయ్య ఉన్నారు. కాగా, వరదలతో ఇబ్బంది పడే ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 08717–231365 నెంబర్‌కు ఫో¯ŒS చేసి సమాచారం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు కోరారు.
Advertisement
Advertisement