క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి | Sporting pursuits at warangal | Sakshi
Sakshi News home page

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

Published Wed, Mar 19 2014 4:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి - Sakshi

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

 వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : పోలీసులు విధులతో పాటు క్రీడా స్ఫూ ర్తిని కూడా పెంపొందించుకోవాలని డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు అన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 15 వరకు వైజాగ్‌లో జరిగిన 47వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో పతకాలు సాధిం చిన వరంగల్ రేంజ్ క్రీడాకారుల (వరంగల్ అర్బన్, రూరల్, ఖమ్మం)ను డీఐజీ మంగళవా రం అభినందించారు.
 
 ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పోలీసు క్రీడాకారులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియో గం చేసుకుని ముందుకుసాగాలని సూచించా రు. క్రీడల్లో రాణించే పోలీసులకు మంచి భవి ష్యత్ ఉంటుందన్నారు. రేంజ్ పరిధిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు, సీఐలు పాల్గొన్నారు.
 
 
 పతకాలు సాధించిన  క్రీడాకారుల వివరాలు..
 వైజాగ్‌లో ఐదురోజుల పాటు జరిగిన పోలీసు క్రీడల్లో వరంగల్ రేంజ్ క్రీడాకారులు మొత్తం 40 పతకాలు సాధించారు. ఇందులో 10 బం గారు, 10 రజతం, 20 కాంస్య పతకాలతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌తో పాటు జూడో విభాగంలో రన్నరప్‌గా నిలిచి తమ సత్తా చాటారు.
 
 
  పురుషుల విభాగంలో 100, 200ల మీటర్లు, లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లో సివిల్ కానిస్టేబుల్ పి. సర్వేష్ ఒక బంగారు, 3 కాంస్య పతకాలను గెలుచుకుని వ్యక్తిగత చాం పియన్‌షిప్ కైవసం చేసుకున్నాడు.
 
 అర్బన్ కానిస్టేబుల్ బి.శ్రవణ్‌కుమార్ 1500, 5 కిలోమీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలో బంగా రు, రజత, కాంస్య పతకాలు సాధించాడు. జూడో, రెజ్లింగ్ 63 విభాగాల్లో మహిళా కానిస్టేబుల్ ఎన్.స్వర్ణ బంగారు పతకం సాధించింది. జూడో 70 కిలోల విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ శోభారాణి బంగారు పతకం పొందింది.
 
 అలాగే జూడో 57 కిలోల విభాగంలో ఎస్.గీత బంగారు, రెజ్లింగ్ 75 కిలోల విభాగంలో కె.అరుణ బంగారు, 20 కిలోమీటర్ల నడకపోటీలో సివిల్ కానిస్టేబుల్ వెంకన్న బంగారు పతకాలు సాధించారు. కాగా,  హైజంప్‌లో ఖమ్మం కానిస్టేబుల్ రాజువర్మ బంగారు పత కం గెలుచుకోగా, కానిస్టేబుళ్లు హరికృష్ణ మూ డు రజత, కె.నవీన్‌కుమార్ ఒక రజతం, ఒక కాంస్యం, ఖమ్మం కానిస్టేబుల్ శివ, కిరణ్‌కుమార్‌లు చెరో కాంస్య పతకాలు పొందారు.
 
  ఇదిలా ఉండగా, ఇదే విభాగంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ సునీత ఒక రజత, కాంస్యం, ఎన్.స్వర్ణలతారెడ్డి జూడో, రెజ్లింగ్ బాక్సింగ్ విభాగాల్లో రెండు రజత పతకాలను గెలుచుకున్నారు. కానిస్టేబుల్ వి.చలపతి రెండు, హెడ్‌కానిస్టేబుల్ బి.రవి, కె.ఉప్పలయ్య, ఎస్.చంద్రశేఖర్, జేహెచ్‌ఎన్.శ్రీనివాస్, ఎన్.కుమారస్వామి, ఎం.శ్రీనివాసులు, మహిళా హెడ్‌కానిస్టేబుల్ జమునరాణిలు జూడో, రెజ్లింగ్ విభాగాల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
 
 కాగా, ప్రతిభచూపిన క్రీడాకారులకు డీఐజీ నగదు పురస్కారం అందజేశారు. ఇదిలా ఉం డగా, మహిళా రెజ్లింగ్, జూడో క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించేందుకు కృషిచేసిన ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ బెజ్జం రవి, హా కీ కోచ్  ట్రాఫిక్ ఎస్సై యాదగిరిరెడ్డి, టీమ్ మేనేజర్, డీఎస్పీ కుమారస్వామి, కెప్టెన్ ప్రతాప్‌ను డీఐజీ, రూరల్ ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement