తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డీఐజీ ఎం.కాంతారావు వెల్లడించారు. తిరుపతి నగరంలోని నిర్వహించిన నాలుగు జిల్లాల పోలీస్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సందర్బంగా ఎం. కాంతారావు మాట్లాడుతూ... శేషాచల అడువుల్లో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెరుగుతుండటంతో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక, తమిళనాడు పోలీసులతో కలసి పని చేస్తున్నట్లు కాంతారావు వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఈ సమావేశంలో ఎక్కువగా ప్రస్థావనకు వచ్చాయని తెలిపారు. అలాగే ఎర్రచందనం బడా స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని ఎం కాంతారావు చెప్పారు.