properties attachment
-
నీరవ్ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్ మోదీకి సంబంధించిన రూ.329.66 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో 200 కోట్ల అమెరికన్ డాలర్ల మోసానికి సంబంధించి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీతోపాటు మరికొందరిని ఈడీ విచారిస్తున్నది. ఈడీ జప్తు చేసిన నీరవ్ మోదీ ఆస్తుల్లో ముంబైలోని వర్లిలోని సముద్రమహల్‌లో నాలుగు ఫ్లాట్లు, సముద్ర తీరంలోని ఒక ఫాంహౌజ్, అలీబాగ్‌లో ఓ స్థలం, జైసల్మేర్‌లోని విండ్ మిల్లు, లండన్‌లోని ఒక ఫ్లాట్, యూఏఈలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఆస్తుల జప్తు గురించి ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ముంబైలోని స్పెషల్ కోర్టులో డిసెంబర్ 5న నీరవ్ మోదీని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. గత నెల 8న ఇదే కోర్టు ఈడీకి నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసే అధికారం ఇచ్చింది. 49 ఏండ్ల నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నాడు. 2019 మార్చిలో లండన్‌లో అరెస్టయినప్పటి నుంచి మోదీ జైల్లో గడుపుతున్నాడు. -
సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరి, ఆయన కంపెనీలకు చెందిన రూ 254 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజేష్ సక్సేనా ద్వారా ఎఫ్‌డీఐల రూపంలో అక్రమ నగదును దేశానికి తీసుకువచ్చారని వెల్లడించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందంలో సమకూరిన లంచాల సొమ్మును దారిమళ్లించడంలో రతుల్ పూరి పాత్రపై ఐటీ, ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా తాను రాజకీయ నేత బంధువనే కారణంతో ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ రతుల్ పూరీ ఈనెల 27న ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు రతుల్ పూరి దర్యాప్తునకు సహకరించడం లేదని, వాస్తవాలు వెల్లడించడం లేదని ఈడీ వాదిస్తోంది. పూరి బెయిల్ దరఖాస్తును ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారిస్తోంది. -
డ్రగ్ రాకెట్ : బాలీవుడ్ నటి ఆస్తులు అటాచ్
సాక్షి, థానే : కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్ కేసులో కీలక నిందితురాలు, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రత్యేక ఎన్డీపీస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు ఎదుట హాజరు కావడంలో విఫలమవడంతో మమతా ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయమూర్తి హెచ్ఎం పత్వర్ధన్ ఆదేశించారు. మమతా కులకర్ణికి చెందిన ముంబయిలోని మూడు విలాసవంతమైన ఫ్లాట్లను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్లాట్ల ప్రస్తుత విలువ రూ 20 కోట్లుగా ఉంటుందని అంచనా. మమతా ఆస్తుల అటాచ్‌ను కోరుతూ ప్రాసిక్యూషన్ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన కోర్టు మమతా కులకర్ణికి చెందిన మూడు ఆస్తులను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరే చెప్పారు. రూ 2000 కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున మమతా కులకర్ణి పరారీ ఉన్నారని కోర్టు ప్రకటించింది. డ్రగ్ బ్యారన్ విక్కీ గోస్వామితో సన్నిహిత సంబంధాలతో అక్రమ కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొనేదని పోలీసులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట థానే పోలీసులు వెలుగులోకి తెచ్చిన డ్రగ్ రాకెట్‌కు మమతా కులకర్ణిని సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. కెన్యాలో తలదాచుకున్న గోస్వామి, మమతా కులకర్ణిలను భారత్‌కు రప్పించే ప్రక్రియను చేపట్టామని థానే పోలీసులు పేర్కొన్నారు. -
‘ఆ 6 ఫ్లాట్ల విలువే రూ . 900 కోట్లు’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడిన బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. నీరవ్‌కు చెందిన 29 ఆస్తులను ఇటీవల ఐటీ అధికారులు అటాచ్ చేశారు. వీటిలో ముంబయిలోని వొర్లిలో సముద్ర మహల్లో నీరవ్, ఆయన భార్య పేరిట ఉన్న ఆరు ఫ్లాట్ల ఖరీదు రూ 900 కోట్ల పైమాటేనని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటాచ్ చేసిన నీరవ్ ఆస్తుల మొత్తం విలువ రూ వేల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. వొర్లిలో సముద్రానికి అభిముఖంగా ఉన్న సముద్ర మహల్లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ 150 కోట్లు పైగా పలుకుతుందని సీనియర్ ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ముంబయిలో 15 అధిక విలువ కలిగిన స్ధిరాస్తులున్నాయి. వీటిలో బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో ఓ కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. ఒపెరా హౌస్‌లోని ప్రసాద్ ఛాంబర్స్‌లో ఫ్లాట్‌తో పాటు ఫోర్ట్ ముంబయిలో ఐటీటీఎస్ హౌస్, లోయర్ పరేల్‌లోని ట్రేడ్ పాయింట్లో ఓ ఫ్లోర్ ఆయన కంపెనీకి ఉన్నాయి. అంథేరిలోని ఆర్మీ నేవీ ప్రెస్ భవనంతో పాటు, ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీలో నీరవ్ కంపెనీకి ఓ ఇల్లు ఉంది. ఇవి కాకుండా దేశ విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఆయనకు ఖరీదైన భవనాలు, స్ధిరాస్తులు ఉన్నట్టు సమాచారం. -
నీరవ్ మోదీపై భారీ ఎత్తున కొరడా
న్యూఢిల్లీ : పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా కొరడా ఝుళిపిస్తున్నారు. నిన్న కాక మొన్ననే రూ.5100 కోట్ల వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీబీఐ అధికారులు సీజ్ చేయగా.. నేడు ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసింది. పన్ను ఎగవేత విచారణ కింద నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాక విదేశాల్లో ఆయన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపిస్తూ... ఆయనపై యాంటీ-బ్లాక్ మనీ యాక్ట్‌ను ప్రయోగించారు. ఈ ఆస్తులు సింగపూర్‌లో ఉన్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త చట్టం కింద లెక్కలో చూపించని విదేశీ ఆస్తులు, ఆదాయంపై 120 శాతం పన్ను వేస్తారు. అంతేకాక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్స్ 276 సీ(1), 277 ఏ, 278 బీ, 278 ఈ కింద మోదీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27 ఈ కేసును కోర్టు విచారించనుంది. సూరత్, ముంబై, జైపూర్, ఢిల్లీలో ఉన్న నీరవ్ మోదీ, ఆయన భార్య ఆమీ, సంస్థలకు చెందిన స్థిరాస్తులకు పన్ను అధికారులు ఈ అటాచ్మెంట్ నోటీసు పంపారు. మోదీ, ఆయన కుటుంబం, కంపెనీలకు చెందిన మొత్తం 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీకి మొత్తం 150 షెల్ కంపెనీలతో లింక్‌లున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి నీరవ్‌మోదీ పాల్పడ్డ సంగతి తెలిసిందే. పీఎన్బీ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడి, ప్రస్తుతం విదేశాలకు పారిపోయారు. ఈయనను పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. -
'కేశవరెడ్డి' ఆస్తుల అటాచ్మెంట్
హైదరాబాద్: కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూ. 24.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీఐడీకి ఏపీ హోం శాఖ ఆదేశించింది. అధిక వడ్డీల ఆశ చూపి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినట్టు ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తల అటాచ్మెంట్ చేయాలని సీఐడీని ఆదేశించింది. కాగా, నంద్యాల పట్టణం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించినట్టు గతంలో కేశవరెడ్డిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఎర్రచందనం బడా స్మగ్లర్ల ఆస్తులు జప్తు !
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డీఐజీ ఎం.కాంతారావు వెల్లడించారు. తిరుపతి నగరంలోని నిర్వహించిన నాలుగు జిల్లాల పోలీస్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సందర్బంగా ఎం. కాంతారావు మాట్లాడుతూ... శేషాచల అడువుల్లో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెరుగుతుండటంతో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు పోలీసులతో కలసి పని చేస్తున్నట్లు కాంతారావు వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఈ సమావేశంలో ఎక్కువగా ప్రస్థావనకు వచ్చాయని తెలిపారు. అలాగే ఎర్రచందనం బడా స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని ఎం కాంతారావు చెప్పారు.