'కేశవరెడ్డి' ఆస్తుల అటాచ్‌మెంట్
హైదరాబాద్: కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూ. 24.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీఐడీకి ఏపీ హోం శాఖ ఆదేశించింది. అధిక వడ్డీల ఆశ చూపి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినట్టు ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తల అటాచ్‌మెంట్ చేయాలని సీఐడీని ఆదేశించింది.
కాగా, నంద్యాల పట్టణం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించినట్టు గతంలో కేశవరెడ్డిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.